
దిన ఫలాలు (సెప్టెంబర్ 30, 2026): మేష రాశి వారు ఉద్యోగాల్లో మరింతగా పురోగతి సాధించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటవుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. మిథున రాశి వారికి ఈ రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఏ ప్రయత్నం చేపట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగాల్లో మరింతగా పురోగతి సాధించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటవుతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ప్రతి పనీ బాగా అనుకూలంగా పూర్తవుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొందరు మిత్రుల సహాయంతో వ్యక్తిగత పనుల్ని పూర్తి చేస్తారు. ఆర్థిక, ఆదాయ పరిస్థితులు బాగా సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బంది లేదు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. షేర్లు బాగా లాభిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లల బాగా వృద్ధిలోకి వస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఏ ప్రయత్నం చేపట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ముఖ్యమైన నిర్ణ యాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొం టారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
సొంత పనులు, బాధ్యతల మీద దృష్టి పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగుతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఇంటా బయటా పని ఒత్తిడి ఉంటుంది. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కొత్త వ్యాపారాలకు సమయం అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో కొద్దిగా మాట పట్టింపులకు అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని ప్రత్యేక బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాలు అనుకూలంగా పురోగమిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. తోబుట్టువులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు పెడతారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా పురోగతి చెందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొన్ని దీర్ఘకాలిక వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తికి సంబంధించిన క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో రాబడి, లాభాలు స్థిరంగా కొనసాగుతాయి. పెట్టుబడులకు తగ్గట్టుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ కు అవకాశం ఉంది. తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. నిరు ద్యో గులకు ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాల్లో ఎవరినీ జోక్యం చేసుకోనివ్వవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా పురోగతి చెందు తాయి. నిరుద్యోగులకు ఆఫర్లు, అవకాశాలు అందుతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాల్ని వాయిదా వేయడం మంచిది. వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఇతరుల వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూర్చవద్దు. భూ సంబంధమైన క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు బరువు బాధ్యతలు పెంచుతారు. కొన్ని భారీ లక్ష్యాలు అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ఊహించని లాభాలను పొందుతారు. కొందరు బంధువులు, స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబసమేతంగా తీర్థయాత్ర లేదా విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు కొద్ది ప్రయత్నంతో చక్కబడతాయి. బంధుమిత్రులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక సమస్యలను బాగా తగ్గించుకుంటారు. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దు. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం పరవాలేదు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఇతరుల బాధ్యతల్ని తలకెత్తుకుని ఇబ్బంది పడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కానీ, అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూ లంగా సాగిపోతాయి. కొద్దిపాటి పని ఒత్తిడి తప్పకపోవచ్చు. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ఇంటా బయటా పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. కొందరు స్నేహితుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఊహించని ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సొంత ఇంటికి సంబంధించిన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు ఒక శుభవార్త అందుతుంది.