
దినేష్ తేజ్, దష్విక.కె జంటగా అర్జున్ కోలా దర్శకత్వంలో శీమకుర్తి వంశీ కృష్ణ , శ్వేత పసుపులేటి నిర్మించిన చిత్రం ‘తత్వం’. అక్టోబర్ 2న సినిమా విడుదల కానుంది. మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా దినేష్ తేజ మాట్లాడుతూ ‘మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. కథ విన్నప్పుడు ఎలాంటి నమ్మకం ఉందో ఇప్పుడు విజయంపై అంతే విశ్వాసం ఉంది. కథే మా ధైర్యం, ప్రేక్షకులే మా బలం. క్లైమాక్స్ అందరి మనసులను తాకుతుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అని అన్నాడు.
ఈ సినిమాలో నటించడం పట్ల హీరోయిన్ దష్విక సంతోషం వ్యక్తం చేసింది. దర్శకుడు అర్జున్ కోలా మాట్లాడుతూ ‘ఎన్నో స్ట్రగుల్స్ దాటుకుని ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన సమయంలో హీరో, హీరోయిన్ కారు యాక్సిడెంట్‌కు గురయ్యారు. మళ్లీ వాళ్లు కోలుకునే సరికి టైమ్ పట్టింది. అక్టోబర్ 2 రిలీజ్ డేట్ ఇచ్చి ప్రమోషన్స్ స్టార్ట్ చేయగానే అదే టైమ్‌కు డజను సినిమాలు వస్తున్నాయి. అయినాసరే కంటెంట్‌పై నమ్మకంగా ఉన్నాం’ అని చెప్పాడు.
టీమ్ అంతా పాల్గొన్నారు.