
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రం రిలీజ్‌కు ముందే బిజినెస్ వర్గాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం టాలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీ పడుతున్నాయి.
ఫిల్మ్ నగర్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు దక్కించుకోవడానికి టాలీవుడ్ అగ్ర నిర్మాతలయిన దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్, మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పోటీపడుతున్నారు. అటు ఇటుగా రూ. 275 కోట్ల మేర ఆఫర్ చేస్తున్నారట. ఇప్పటివరకు తెలుగు చలనచిత్ర చరిత్రలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక బిజినెస్ చేసిన చిత్రంగా రాజమౌళి RRR పేరిట ఉంది. ఆ సినిమా సుమారు రూ. 225 కోట్ల ధర పలికాయి. ఆర్ ఆర్ ఆర్ కంటే రూ. 50 కోట్లకు పైగా ఎక్కువ కోట్ చేస్తున్నారు. అయితే ఈ డీల్ ఇంకా క్లోజ్ కాలేదు. మూడు ప్రముఖ సంస్థలు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఒకరికి మించి మరొకరు ఆఫర్ చేయడంతో విజయదశమి తరువాత ఒక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఒక పక్కన రాజమౌళి సినిమాలు రెగ్యులర్ గా చేసే ఒక సంస్థ,డిస్ట్రిబ్యూటర్స్ కి సినిమా మేమే బిజినెస్ చూస్తాము, సినిమా మీకే అని పలువురు పంపిణీ దారులకు మాట ఇస్తున్నారట. ఫైనల్ డీల్ ఫిక్స్ అయ్యేసరికి ఈ ఆఫర్ రేంజ్ మరిన్ని కోట్లు దాటే అవకాశముందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.