Reading Time: < 1 minute
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతాలపై ఒక ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. అలాగే, సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఒక ఉత్తర-దక్షిణ ద్రోణి, దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ. ఉత్తర తమిళనాడు, ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనం మీదుగా మన్నార్ సింధుశాఖ వరకు విస్తరించి కొనసాగుతోంది.

తెలంగాణ వెదర్ రిపోర్ట్..

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. వీటి ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచనలు :-

అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం తోపాటు.. పలు ప్రాంతాల్లో బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 గరిష్టముగా 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..