
హైదరాబాద్: నాచ్యురల్ స్టార్ నాని, తెలంగాణ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్యారడైజ్. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యా్ప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. బీఆర్ఎస్ కేసీఆర్ను పోలిన పాత్రను ఈ సినిమాలో చూపించడం.. కేసీఆర్ స్టైల్ ఆఫ్ టాకింగ్, స్వాగ్ సినిమాలో చూపించడంతో బీఆర్ఎస్ శ్రేణులు ప్యారడైజ్ సినిమా చూసి సంబరపడిపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేత, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కార్యకర్తలతో కలిసి మంగళవారం (సెప్టెంబర్ 29) ప్యారడైజ్ సినిమా చూశారు. కోరుట్ల పట్టణంలోని కిన్నెర థియేటర్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. మూవీలో కేసీఆర్ను పోలిన శంకరన్న పాత్ర కనబడగానే పేపర్లు చల్లుతూ, విజిల్స్ వేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
►ALSO READ | SS Rajamouli: రెక్కలు చాచి.. మంటలు చిమ్మే ‘డ్రాగన్’ అంటూ.. ఎన్టీఆర్ సినిమాపై జక్కన్న భారీ హైప్
సినిమా చూసిన అనంతరం ఎమ్మెల్యే సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. డైరెక్టర్ శ్రీకాంత్ తెలంగాణ కథను ఈ సినిమాలో చూపించారని అన్నారు. ఒక నాయకుడు తన జాతి కోసం ప్రాణాలు ప్రాణంగా పెట్టి కష్టపడితే.. ఇంకో నాయకుడు పదవి, కుర్చీ కోసం తహతలాడడం ఈ సినిమా కథ అన్నారు. కాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్యారడైజ్ సినిమా చూసిన విషయం తెలిసిందే.