Reading Time: < 1 minute
When Is The Muhurtham For Sreeleelas Bollywood Debut

టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీలీల బాలీవుడ్‌లో ఎంత త్వరగా ఇంట్రడ్యూసై కెరీర్ బిల్డ్ చేసుకుందామా అనుకుంటే అంతంత వెనక్కు వెళుతోంది డెబ్ల్యూ ఫిల్మ్. 2024లో మొదలు పెట్టిన మ్యూజికల్ లవ్ స్టోరీ ఇప్పటికీ పూర్తి కాలేదు. కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్నఈ మూవీని గత ఏడాది దీపావళికే తీసుకొస్తామన్నారు కానీ ఈ ఏడాది దీపావళికి కూడా వచ్చేట్లుగా లేదు.

కార్తీక్ ఆర్యన్ ఇతర కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమా షూట్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఇటీవల కబీర్ ఖాన్ సినిమా షూటింగ్‌లో కార్తీక్ ఆర్యన్ గాయపడంతో షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చాడు. కోలుకుని తిరిగి వచ్చాక.. అనురాగ్ బసు మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ అండ్ శ్రీలీలపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు డైరెక్టర్. తు మేరీ జిందగీ హై టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ మూవీ ఈ ఏడాది కూడా రిలీజ్ కావడం కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ ప్రాజెక్ట్ వల్ల వైరల్ వయ్యారీ కూడా అజిత్ మూవీని వదిలేసుకున్నట్లు టాక్. అజిత్64వ మూవీకి శ్రీలీల ఫిక్సైంది. డేర్ డెవిల్ నవంబర్ 2 నుండి షూటింగ్ మొదలు కానుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీలో డ్యాన్సింగ్ క్వీన్ ప్లేసులోకి ఆషికా రంగనాథ్ నేమ్ పరిశీలిస్తున్నట్లు బాలీవుడ్ బజ్. ఇక ధనుష్‌తో నటిస్తున్న ఓమ్ దసరా రేసు నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో వరుస ఫ్లాప్స్ టేస్ట్ చేయడంతో వైరల్ వయ్యారీని లైట్ తీసుకుంటున్నారు మేకర్స్.