Reading Time: < 1 minute

ఢిల్లీలో బారాపుల్లా ఫేజ్–3 ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభం

Caption of Image.
  • రూ.1,635 కోట్ల విలువైన ఎలివేటెడ్​ కారిడార్​​ను ప్రారంభించిన అమిత్ ​షా
  • మొత్తం రూ.1,951 కోట్ల విలువైన నాలుగు ప్రాజెక్టులు ప్రారంభం 

న్యూఢిల్లీ:

ఢిల్లీలో రూ.1,635 కోట్ల వ్యయంతో నిర్మించిన బారాపుల్లా ఫేజ్–3 ఎలివేటెడ్ కారిడార్​ను మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్​షా ప్రారంభించారు. ఢిల్లీలో  మొత్తం రూ.1,951 కోట్ల విలువైన నాలుగు ప్రధాన రహదారుల ప్రాజెక్టులను అమిత్​షా ప్రారంభించారు. వీటిలో చాలా కాలంగా ఆలస్యమైన బారాపుల్లా ఫేజ్–3 ఎలివేటెడ్ కారిడార్, ముకర్బా చౌక్ అండర్‌‌‌‌పాస్ కూడా ఉన్నాయి. అలాగే, మోదీ మిల్ ఫ్లైఓవర్ పొడిగింపు, లోని అండర్‌‌‌‌పాస్ పనులను కూడా హోంమంత్రి ప్రారంభించారు. 

5 కిలోమీటర్ల పొడవైన బరపుల్లా ఫేజ్–3 కారిడార్.. మయూర్ విహార్ ఫేజ్ I, సరాయ్ కాలే ఖాన్ మధ్య సిగ్నల్- ఫ్రీ మార్గాన్ని అందిస్తుంది. ఎయిమ్స్, దక్షిణ ఢిల్లీకి కూడా కనెక్టివిటీని కల్పిస్తుంది. ఇది సరాయ్ కాలే ఖాన్ వద్ద ఇప్పటికే ఉన్న బారాపుల్లా కారిడార్‌‌‌‌తో కలుస్తుంది. దీంతో మొత్తం ఎలివేటెడ్ మార్గం పొడవు సుమారు 9 కిలోమీటర్లకు చేరుతుంది. ఈ ప్రాజెక్ట్‌‌‌‌లో ప్రత్యేక సైకిల్ ట్రాక్,  పాదచారుల మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి. 

ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఢిల్లీలోని రవాణా, ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం సంయుక్తంగా వేగంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఏండ్ల తరబడి నిలిచిపోయిన ఈ కీలక ప్రాజెక్టును వేగవంతం చేసి చివరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుల వల్ల ఈస్ట్ ఢిల్లీ, వెస్ట్​ఢిల్లీ మధ్య ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ నుంచి ఢిల్లీవాసులకు పెద్ద ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.  

©️ VIL Media Pvt Ltd.