Reading Time: < 1 minute
Life Style Hacks: షూ బాక్సుల్లో ఉండే ఆ చిన్న ప్యాకెట్‌ను పారేస్తున్నారా?.. వీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

సిలికా జెల్ అనేది కేవలం గాలిలోని తేమను పీల్చుకోవడమే కాదు, వస్తువుల నిల్వ కాలాన్ని కూడా పెంచుతుంది. పౌడర్ మేకప్ ఉత్పత్తులు గడ్డకట్టకుండా ఉండాలన్నా, పాత పుస్తకాలు దుర్వాసన రాకుండా ఉండాలన్నా ఈ ప్యాకెట్లు ఎంతో అవసరం. అయితే, వీటిని వాడేటప్పుడు కొన్ని భద్రతా నియమాలు కూడా పాటించాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, పెంపుడు జంతువుల విషయంలో మనం చేసే చిన్న పొరపాటు ప్రాణాల మీదకు రావచ్చు. మరి ఆ ఉపయోగాలు తెలుసుకుందాం..

సిలికా జెల్ వల్ల కలిగే 10 అద్భుత ఉపయోగాలు:

కెమెరా లెన్స్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు తేమ వల్ల పాడవకుండా వాటి బాక్సుల్లో ఈ ప్యాకెట్లను ఉంచండి.

వెండి ఆభరణాల డబ్బాలో ఒక ప్యాకెట్ ఉంచితే అవి నల్లబడకుండా ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాయి.

మీ ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకాలు పాత ఫోటోలు తేమ వల్ల అతుక్కోకుండా రక్షిస్తాయి.

బూట్ల నుండి వచ్చే బ్యాక్టీరియా వాసనను ఇవి పీల్చుకుంటాయి.

చెమట వాసన వచ్చే జిమ్ బ్యాగుల్లో వీటిని ఉంచడం వల్ల బ్యాగ్ ఎప్పుడూ తాజాగా ఉంటుంది.

ఐషాడో, ఫేస్ పౌడర్ వంటివి తేమ వల్ల గడ్డకట్టకుండా ఎక్కువ కాలం వస్తాయి.

లైబ్రరీ లేదా పాత పుస్తకాల అరల్లో ఉంచితే ఆ చెడు వాసన పోతుంది.

టూల్‌బాక్స్‌లో ఇవి ఉంటే మేకులు, పనిముట్లు తుప్పు పట్టవు.

మందుల సీసాల్లో వీటిని ఉంచడం వల్ల టాబ్లెట్లు పాడవకుండా ఉంటాయి (తినకుండా జాగ్రత్త పడాలి).

వార్డ్‌రోబ్‌లో ఉంచితే బట్టలకు బూజు పట్టదు.

ముఖ్యమైన భద్రతా హెచ్చరిక:

సిలికా జెల్ విషపూరితం కానప్పటికీ, దానిపై “DO NOT EAT” అని రాసి ఉంటుంది. ఎందుకంటే:

ఇది గొంతులో అడ్డుపడి శ్వాస ఆగిపోయే ప్రమాదం ఉంది.

ఇది శరీరంలోని తేమను విపరీతంగా పీల్చుకుని డీహైడ్రేషన్ కలిగిస్తుంది.

పిల్లలు పెంపుడు జంతువులకు వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అందుబాటులో ఉంచవద్దు.

చిన్న చిట్కా: ఈ ప్యాకెట్లు తేమను పీల్చుకుని బరువుగా మారినప్పుడు, వాటిని ఎండలో కొద్దిసేపు ఉంచితే మళ్ళీ కొత్త వాటిలా పనిచేస్తాయి.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. వీటిని ఉపయోగిస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు పాటించండి.