Reading Time: < 1 minute
Tv9 Crossfire: కబ్జాదారుల్లో అన్ని పార్టీల వారున్నారు.. ఎవరికి క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదుః హైడ్రా కమిషనర్

విశ్వ నగరంగా ఎదుగుతున్న భాగ్యనగరానికి మంచి భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తోందని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. హైడ్రా చర్యలపై వస్తున్న విమర్శల నడుమ కమిషనర్ రంగనాథ్ టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌తో జరిగిన క్రాస్‌ఫైర్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపిందని, అక్రమణలకు గురైన వందలాది ఎకరాల భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించినట్లు రంగనాథ్‌ తెలిపారు.

ప్రభుత్వ భూములను కబ్జా చేసిన సంపన్నులు, రాజకీయ నాయకులు ఎవరైనా వదిలేది లేదన్నా రంగనాథ్. సంస్కరణలను ఎవరో ఒకరు మొదలు పెట్టాలి కదా అని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. అలాగే ఎలాంటి భూమి కొనాలో పబ్లిక్‌కు అర్థమవుతోందన్నారు. చెరువును కబ్జా చేసిన కట్టిన N కన్వెన్షన్‌ కూల్చాం కానీ.. బస్తీని కాదని గుర్తి చేశారు. అలాగే సున్నం చెరువు కబ్జాలోనూ అందరి ఇళ్లు కూల్చలేదన్నారు. కబ్జాదారుల్లో అన్ని పార్టీల వారున్నారు.. హైడ్రా ఎవరికి క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో.. కొందరు నేతలు హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..