Reading Time: < 1 minute

వినూత్న ఆలోచనలే ఆవిష్కరణలకు దోహదం

Caption of Image.

హసన్ పర్తి, వెలుగు : వినూత్న ఆలోచనలే ఆవిష్కరణలకు దోహదపడతాయని రేవల్సిస్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు రాజ్ సామాల అన్నారు. శనివారం ఎస్సార్ యూనివర్సిటీలో ‘ప్రగతి – నేషనల్ లెవల్ ప్రాజెక్ట్ ఎక్స్ పో 2కే26’ ఘనంగా నిర్వహించారు. ఈ ఎక్స్ పోలో 23 విశ్వవిద్యాలయాలు ఇంజినీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొని 100కు పైగా వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి చీఫ్​గెస్ట్​గా రాజ్ సామాల హాజరై మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యలో ప్రాక్టికల్ లెర్నింగ్, ఇన్నోవేషన్​కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

అనంతరం జ్యూరీ సభ్యులు ప్రాజెక్టులను ఆవిష్కరణ, సాంకేతిక రూపకల్పన, ప్రాక్టికల్ వినియోగం, ప్రదర్శన విధానం వంటి ప్రమాణాల ఆధారంగా పరిశీలించి, విజేతలను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో హనుమకొండ కెనెరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సతీశ్​కుమార్, వైస్ చాన్సలర్ దీపక్ గార్గ్, రిజిస్టర్ రమణారావు, రిజిస్ట్రార్ అర్చనారెడ్డి పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.