Reading Time: < 1 minute
Vikarabad Woman Krishnaveni Found Dead Kuppagiri Land Dispute Murder Allegation

VKB MAHILA DEATH: వికారాబాద్‌లో దారుణం జరిగింది. ఇంటి నుంచి రాత్రిపూట బయటకు వెళ్లిన మహిళ శవంగా మారింది. పక్కింట్లోనే ఉరికి వేలాడుతూ కనిపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మహిళను ఎవరైనా చంపేశారా? లేదా తానే ఆత్మహత్య చేసుకుందా? అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు కృష్ణవేణి. వికారాబాద్‌ మండలం కుప్పగిరిలో భర్త అశోక్‌తో కలిసి నివసిస్తోంది. ఉన్నట్టుండి ఈ మహిళ పక్కింట్లో శవమై తేలింది. ఐతే ఇది ముమ్మాటికీ హత్యే అంటున్నారు కృష్ణవేణి భర్త అశోక్.

మహిళ చనిపోయే కంటే నాలుగు రోజుల క్రితం కుప్పగిరికి చెందిన మదరప్ప, అశోక్‌ కుటుంబ సభ్యులకు భూమి విషయంలో పంచాయితీ జరిగింది. ఈ విషయంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అక్కడే పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నారు. ఇకముందు ఎలాంటి గొడవలు చేసుకోమని హామీపత్రం సైతం రాసుకున్నారు. అలా పెద్దల మధ్య ఒప్పందం రాసుకున్న వారు.. భూమి విషయంలో మరోసారి గొడవకు దిగారు. ఇందులో అశోక్‌ భార్య కృష్ణవేణిపై మదరప్ప కుటుంబ సభ్యులు దాడి చేసి గాయపర్చారు. ఐతే అదే రోజు రాత్రి గ్రామంలో ప్రదర్శించిన నాటకం చూడటానికి వెళ్తానని చెప్పిన కృష్ణవేణి.. తెల్లవారే సరికి పక్కింట్లో దూలానికి ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. దీంతో తన భార్యను మదరప్ప కుటుంబ సభ్యులు హత్యచేసి.. ఇలా ఉరి వేశారని మృతురాలి భర్త, కుటుంబీకులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి

పరిసరాలను పరిశీలించి.. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం కొడంగల్‌ ఆస్పత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని బాధిత కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. మృతురాలి భర్త అశోక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.