Reading Time: < 1 minute

మద్యం మత్తులో యాక్సిడెంట్ చేశానని.. మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య.. 

Caption of Image.

మద్యం మత్తులో యాక్సిడెంట్ చేశానని.. మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య.. మద్యం మత్తులో యాక్సిడెంట్ చేశానని మనస్తాపంతో ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ లోని ఆదిభట్లలో జరిగింది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లికి చెందిన ఎరకుల బాలకృష్ణ మార్చి 8న రాత్రి 11.30 గంటలకు తుర్కయంజాల్ బావర్చి హోటల్ వద్ద థార్ వాహనం(టీజీ07ఆర్6502) నడుపుతూ వేగంగా ఒక బైక్ ను ఢీకొట్టాడు. 

ఈ క్రమంలో బైక్ పై వెళ్తున్న మనోజ్, మంజునాథ్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. గాయపడ్డవారి బంధువుల ఫిర్యాదుతో మార్చి 9న ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో బాలకృష్ణపై కేసు నమోదైంది. ప్రమాదానికి కారణమైన ఎరకుల బాలకృష్ణ కు 10న నోటీసు అందజేసి పంపించారు పోలీసులు. అనంతరం తాను మద్యం మత్తులో యాక్సిడెంట్ చేశానని భావించి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తాను చనిపోతున్నానని మార్చి 11న ఎరకుల బాలకృష్ణ ఇంటి నుండి బయటకు వెళ్లాడు. బార్య శ్రావణి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పంధించలేదు. దీంతో ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది శ్రావణి. 

శ్రావణి ఫిర్యాదుతో కేసు నమోదుచేసి ధర్యాప్తు చేపట్టారు పోలీసులు. బాలకృష్ణ శ్రీశైలం హైవే పక్కన కొట్రా గ్రామ శివారులో ఒక చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంభసభ్యులకు అప్పగించారు. బాలకృష్ణ మరణంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

©️ VIL Media Pvt Ltd.