July 9, 2026

పరిశ్రమల అభివృద్ధితో ఉపాధి అవకాశాలు :  ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

పరిశ్రమల అభివృద్ధితో ఉపాధి అవకాశాలు :  ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
Reading Time: < 1 minute

పరిశ్రమల అభివృద్ధితో ఉపాధి అవకాశాలు :  ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

Caption of Image.

మల్కాజిగిరి, వెలుగు: పరిశ్రమలు అభివృద్ధి చెందితేనే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం ఐడీఏ చర్లపల్లిలోని ఇండస్ట్రీస్ అసోసియేషన్ కార్యాలయ సముదాయంలో నిర్వహించిన ‘సీఐఏ ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో- 2026’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వివిధ పారిశ్రామిక స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు  ప్రోత్సాహం అందించే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. టీఐఎఫ్ అధ్యక్షుడు కె. సుధీర్ రెడ్డి, చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. శ్రీనివాస రెడ్డి, కార్యదర్శి పి.ఎస్. మోహన్ పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.