Reading Time: < 1 minute

బెంగళూరులో దారుణం: బైక్ ఇవ్వలేదని లవర్, ఆమె తల్లిదండ్రులకి నిప్పంటించిన వ్యక్తి..

Caption of Image.

బెంగళూరులోని నందిని లేఅవుట్‌లో ఉండే పాండురంగ (32) అనే వ్యక్తి తన భాగస్వామి సుమలత (27), ఆమె తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన  ఘటన కలకలం రేపింది.

సమాచారం ప్రకారం… ఆదివారం రోజు నిందితుడు పాండురంగ, తరబనహళ్లిలో ఉంటున్న సుమలత ఇంటికి వెళ్లాడు. తన బైక్ తనకు ఇచ్చేయాలని ఆమెతో గొడవకు దిగాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు కూడా వచ్చి అతడికి  నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

దీంతో తీవ్ర కోపానికి గురైన పాండురంగ వెంటనే అతని దగ్గరున్న పెట్రోల్ బాటిల్‌ను తీసి వారిపై పోశాడు. తరువాత లైటర్‌తో నిప్పంటించి అక్కడి నుండి పరారయ్యాడు.

ALSO READ : హైడ్రా యాక్షన్.. కమ్యూనిటీ వాసుల రియాక్షన్..

మంటల్లో చిక్కుకున్న సుమలత, ఆమె తల్లిదండ్రులను చుట్టుపక్కల వారు కాపాడి, వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. బాధితురాలు సుమలత ఒక ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తోంది. సోలదేవనహళ్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. నిందితుడిపై హత్యాయత్నం, పలు సెక్షన్ల కింద  కేసు పెట్టి అదే రోజు  ఆదివారం  నిందితుడిని అరెస్ట్ చేసారు.

©️ VIL Media Pvt Ltd.