Reading Time: < 1 minute
Middle East War 2026 12 Countries Impacted Khamenei Death Iran Retaliation

Israel-Iran War:ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం యావత్ ప్రపంచాన్ని భయానికి గురిచేస్తోంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలోని దేశాలు వణికిపోతున్నాయి. నిన్న ఇజ్రాయిల్ యూఎస్ కలిసి ఇరాన్‌పై దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించారు. అప్పటి నుంచి ఇరాన్ ప్రతీకార దాడుల్ని ప్రారంభించింది. అమెరికాకు మిత్రదేశాలుగా ఉన్న గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ ఇలా పలు దేశాలపై మిస్సైల్స్ ప్రయోగించింది. అబుదాబీ, దుబాయ్, దోహా వంటి నగరాలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది.

Read Also: Israel-Iran War: ఇరాన్‌ను ముంచిన “చైనా ఆయుధ వ్యవస్థలు”.. మరోసారి ఘోరంగా విఫలం..

ఇజ్రాయిల్, ఇరాన్ వరకే యుద్ధం పరిమితం కాకుండా ఆ ప్రాంతమంతా విస్తరించింది. మొత్తం 12 దేశాలు ఈ యుద్ధంలోకి లాగబడ్డాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్, జోర్డాన్, యెమెన్, లెబనాన్ దేశాలు యుద్ధంలో ప్రత్యక్షంగా చిక్కుకుని ప్రభావితమయ్యాయి.