Reading Time: < 1 minute
Munna Re Release Prabhas Stylish Action Film Returns To Theatres In 4k On March 6

‘రెబల్ స్టార్’ ప్రభాస్ కెరీర్‌లో అత్యంత స్టైలిష్ యాక్షన్ డ్రామాగా నిలిచిన చిత్రం ‘మున్నా’. దాదాపు 19 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా.. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్‌తో అప్పట్లో యూత్‌లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. కానీ కమర్షియల్‌గా మాత్రం వర్కౌట్ కాలేదు. అయితే ఈ చిత్రాన్ని మరోసారి వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్చి 6న మున్నా మూవీని గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయబోతున్నారు.

మున్నా చిత్రంను అత్యాధునిక 4K టెక్నాలజీతో, వెండితెరపై మరింత గ్రాండ్‌గా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వారం రోజుల్లో ఈ చిత్రం థియేటర్లలోకి రానుండటంతో.. సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు సెలబ్రేషన్స్‌కు ప్లాన్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ద్వారా వంశీ పైడిపల్లి దర్శకుడిగా పరిచయమయ్యారు. హారిస్ జయరాజ్ అందించిన సంగీతం అప్పట్లో ఒక సంచలనం. ఇప్పటికీ ఆ పాటలు సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి.

Also Read: Santosh Sobhan New Movies: లైన్‌లో నాలుగు సినిమాలు.. సంతోష్ ‘బాబు’ బాగా బిజీ!

మున్నా సినిమాలో ప్రభాస్ సరసన గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్‌గా నటించగా.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ శక్తివంతమైన విలన్ పాత్రలో మెప్పించారు. ముఖ్యంగా, తండ్రీకొడుకుల మధ్య సాగే మైండ్ గేమ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఒకవైపు ప్రభాస్ ‘స్పిరిట్’, ‘కల్కి’ వంటి చిత్రాలతో బిజీగా ఉండగా.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం మున్నా సినిమాను మరోసారి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేయడాని సిద్ధమవుతున్నారు.