Reading Time: < 1 minute

ప్రజలందరికీ శివుని ఆశీస్సులు ఉండాలి : రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

Caption of Image.
  • రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

ములుగు, వెలుగు: ప్రజలందరికీ శివుని ఆశీస్సులు ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆకాంక్షించారు. ఆదివారం ములుగు మండలంలోని దేవగిరిపట్నం సేవాఘడ్ లో శివపార్వతుల కల్యాణం, సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతికి హాజరయ్యారు.

అనంతరం ములుగులోని నగరేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణానికి హాజరై, పూజలు చేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, సర్పంచ్​పూలమ్మ, ఉప సర్పంచ్ రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.