Reading Time: < 1 minute

కాంగ్రెస్ లో చేరిన వర్ధన్నపేట ఇండిపెండెంట్ కౌన్సిలర్

Caption of Image.

వర్ధన్నపేట, వెలుగు: వర్ధన్నపేట మున్సిపాలిటీ  ఐదో వార్డు నుంచి ఇండిపెండెంట్​కౌన్సిలర్​గా గెలిచిన శిభారాణి ఆదివారం కాంగ్రెస్ లో చేరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో చేరితేనే వార్డు అభివృద్ధి సాధ్యమని నమ్మి చేరినట్లు ఆమె తెలిపారు. ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్​మహమ్మద్ అయూబ్, నాయకులు బండి చైతన్య రెడ్డి, రాందాన్ నాయక్, బావుసింగ్ పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.