Reading Time: < 1 minute

T20 World Cup: భారత్– పాక్ మ్యాచ్కి వర్షం ముప్పు.. ఆలస్యంగా టాస్! 

Caption of Image.

T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్–ఏలో భాగంగా కొలంబోలోని ఆర్. ప్రేమదాస మైదానంలో భారత్– పాకిస్తాన్ మధ్య జరిగే హై వోల్టేజ్ మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని బరిలోకి దిగుతున్న టీమిండియా, ఈరోజు ( ఫిబ్రవరి 15న) రాత్రి 7 గంటలకు కొలంబోలో  పాకిస్తాన్ తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు జరిగే స్టేడియం వద్ద భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  

శ్రీలంక వాతావరణ శాఖ అధికారుల అంచనాల ప్రకారం, భారత్– సార్ మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం 94 శాతం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో కొలంబో పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై, భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొనింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు గంటలోనే (సాయంత్రం 6 నుంచి7 గంటల మధ్య) ఎక్కువ వర్షం పడే అవకాశం ఉందని సూచించింది. దీంతో భారత్– పాక్ టాస్ ఆలస్యంగా పడే పరిస్థితి నెలకొంది.  

కొలంబోలో జరిగే టీమిండియా– పాకిస్తాన్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేకపోవడంతో.. వర్షం కారణంగా రద్దు అయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ చొప్పున ఐసీసీ కేటాయిస్తుంది. ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు వర్షం పడితే తీవ్ర నిరాశకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ కి వర్షం ముప్పు ఉండటంతో.. పూర్తిగా జరుగుతుందా లేదా అన్నది అనుమానంగా మారింది.  
 

 

©️ VIL Media Pvt Ltd.