Reading Time: < 1 minute

భార్య తాగుడు మానాలని చెప్పినందుకు వ్యక్తి ఆత్మహత్య

Caption of Image.

తాడ్వాయి, వెలుగు: భార్య మద్యం సేవించొద్దని చెప్పడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి సూసైడ్​ చేసుకున్నాడు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన సోమయ్య(55) లిక్కర్​కు అలవాటు పడ్డాడు. తాగడం మానేయాలని శుక్రవారం భార్య మందలించింది. దీంతో సాయంత్రం పత్తిచేను వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను 108 వాహనంలో ములుగు దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.

కుటుంబ సభ్యులను భయపెట్టేందుకు..

చందానగర్‌‌, వెలుగు: మద్యం మత్తులో కుటుంబసభ్యులను భయపెట్టేందుకు ఉరివేసుకున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. హైదరాబాద్​లోని చందానగర్​కు చెందిన గురువయ్య(37) కూలీగా పనిచేస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి తన తమ్ముడు పోలయ్యతో గొడవపడగా, భార్య డయల్‌‌ 100కు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఇద్దరికీ సర్దిచెప్పి పంపించారు. ఆ తర్వాత రాత్రి ఒంటి గంట సమయంలో మద్యం మత్తులో కుటుంబసభ్యులను బెదిరించేందుకు ఇంటి గదిలోకి వెళ్లి గురువయ్య ఉరేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి కొండాపూర్‌‌లోని జిల్లా హాస్పిటల్​కు తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.
 

©️ VIL Media Pvt Ltd.