
న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లోనూ సౌతాఫ్రికా జైత్ర యాత్ర కొనసాగించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్లలోనే ఫినిష్ చేసింది. సౌతాఫ్రికా కెప్టెన్ మర్క్రమ్ 44 బంతుల్లో 4 సిక్సులు, 8 ఫోర్లతో 86 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి అదరగొట్టాడు. అతనికి తోడు చివర్లో డేవిడ్ మిల్లర్ కూడా తోడవడంతో మూడు వికెట్ల నష్టానికి 17.1 ఓవర్లలోనే 178 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. గ్రూప్-డీలో మూడు మ్యాచులు ఆడి మూడూ గెలిచిన టీంగా సౌతాఫ్రికా టాప్ ప్లేస్లోకి వెళ్లింది.
South Africa seal the chase comfortably and climb to the top of the standings. 💪! 🔝🔥
Up next ICC Men’s #T20WorldCup 👉 #WIvNEP | SUN, 15th FEB, 10:30 PM pic.twitter.com/ta4PIenCYA
— Star Sports (@StarSportsIndia) February 14, 2026
సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో న్యూజిలాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే.. సౌతాఫ్రికా బౌలర్ మార్కో జాన్ సేన్ న్యూజిలాండ్ జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. టిమ్ సీఫర్ట్ను (13), ఫిన్ అలెన్ను (31), మార్క్ చాప్మెన్ను (48), రచిన్ రవీంద్ర (13)ను ఔట్ చేసి న్యూజిలాండ్ బ్యాటింగ్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. నాలుగు కీలక వికెట్లను తీయడంతో న్యూజిలాండ్ జట్టు అనుకున్న స్థాయిలో టార్గెట్ను నిలపలేకపోయింది. ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్ సేన్ 4 వికెట్లతో రాణించగా, లుంగీ ఎంగిడీ, కేశవ్ మహరాజ్, కార్బిన్ బోస్చ్.. తలో వికెట్ తీశారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మొదటి ఓవర్ నుంచే అటాకింగ్ బ్యాటింగ్ చేసింది. 62 పరుగుల వరకూ వికెట్ కోల్పోకుండా ఆడింది. 62 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయింది. మళ్లీ.. 102 పరుగుల వరకూ వికెట్ పడలేదు. 102 పరుగుల దగ్గర రికెల్ టన్ వికెట్ పడటంతో సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. మర్క్రమ్ మాత్రం నిలకడగా.. అవసరమైనప్పుడు దూకుడుగా ఆడుతూ స్కోర్ను పరుగులు పెట్టించాడు. 131 పరుగుల బ్రెవిస్ వికెట్ పడటంతో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మిల్లర్, మర్క్రమ్ టార్గెట్ ఫినిష్ చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గ్యూసన్, నీషమ్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.