Reading Time: < 1 minute

హైదరాబాద్లో దారుణం.. బావను చంపిన బామ్మర్దులు..? ఆఫీస్లోనే కత్తులతో పొడిచి పొడిచి హత్య !

Caption of Image.

అత్తాపూర్‌: రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ దారుణ హత్యకు గురయ్యాడు. సులేమాన్ నగర్‌లోని స్వంత ఆఫీసులోనే కత్తులతో దాడి చేసి అతనిని హత్య చేశారు. పలుమార్లు పొడవడంతో సంఘటనా స్థలంలోనే ఖదీర్ మృతి చెందాడు. దాడి అనంతరం నిందితులు పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అత్తాపూర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.

క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. కుటుంబ విభేదాల కోణంలో బామ్మర్దులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యకు అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.