Reading Time: 2 minutes
Tollywood: ఎనిమిదేళ్ల నుంచి వాట్సప్‌ వాడడమే మానేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

ఇప్పుడు మన జీవితాల్లో మొబైల్ ఫోన్ కూడా ఒక భాగమైపోయింది. ఇది లేకుండా ఒక్క నిమిషమైనా  బతకలేం అన్నట్లు ఉంది ప్రస్తుతం పరిస్థితి. చాలా మంది ఉదయం లేవగానే మొబైల్ ఫోన్ చూస్తారు. ముందుగా వాట్సాప్ మెసేజులు, స్టేటస్ లను చెక్ చేసుకుంటారు. అలాగే ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్.. ఇలా సమయం అనేది తెలీయకుండా గంటల కొద్దీ సోషల్ మీడియాలోనే గడుపుతాం. అయితే ఈ స్టార్  హీరోయిన్ మాత్రం చాలా డిఫరెంట్ లైఫ్ స్టైల్ ను అవలంభిస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషా సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ సామాజిక మాధ్యమాలకు చాలా దూరంగా ఉంటోందట. ముఖ్యంగా మన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్  లైఫ్ లో కీలకమైన వాట్సాప్ ను గత ఎనిమిదేళ్లుగా ఉపయోగించడం లేదట.  అలాగే కాలేజీ చదువు పూర్తయినవెంటనే ఫేస్ బుక్ కు గుడ్ బై చెప్పేసిందట. ప్రస్తుతం కేవలం ఇన్ స్టాగ్రామ్ ను మాత్రమే .. అది కూడా చాలా అరుదుగా యూజ్ చేస్తోందట. వర్చువల్ ప్రపంచం కంటే నిజ జీవితమే ముఖ్యమని భావిస్తోన్న ఆ హీరోయిన్ మరెవరో కాదు రజిషా విజయన్.

 

ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించే రజిషా తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీలో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. తన క్యూట్ లుక్స్, యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల మోహన్ లాల్ నటించిన మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ కాలంకావల్ లోనూ ఓ కీలక పాత్ర పోషించిందీ ముద్దుగుమ్మ.  సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటోన్న ఈ ముద్దుగుమ్మ  తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన పర్సనల్ అండ్ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే సామాజిక మాధ్యమాల వినియోగం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

రజిషా విజయన్ లేటెస్ట్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by Rajisha Vijayan (@rajishavijayan)

‘మనుషులను ప్రత్యక్షంగా కలవడం చాలా విలువైన విషయం. ఫోన్ కాల్స్ లేదా మెసేజీల కంటే ముఖాముఖి మాట్లాడటం ఎక్కువ అర్థవంతంగా ఉంటుంది అని నేను భావిస్తాను. షార్ట్స్, రీల్స్ వల్ల చాలా మంది ఫోన్లకు బానిసవుతున్నారు. సమయం ఎంత ముఖ్యమో మనం గుర్తించలేకపోతున్నాము. వీటి బదులు మంచి సినిమాలు చూడవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇతరులతో గడపవచ్చు’ అని రజిషా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Rajisha Vijayan (@rajishavijayan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.