Reading Time: < 1 minute

మద్యం మత్తులో ఎమ్మెల్యే కాన్వాయ్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ అరెస్ట్.. 

Caption of Image.

మద్యం మత్తులో ఎమ్మెల్యే కాన్వాయ్ పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ రోడ్డులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాన్వాయ్ పైకి దూసుకెళ్లింది ఆర్టీసీ బస్సు. సోమవారం ( ఫిబ్రవరి 9 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంచిర్యాలలోని బస్టాండ్ రోడ్డులో వెళ్తుండగా ఆయన కాన్వాయ్ పైకి ఓ ఆర్టీసీ బస్సు దూసుకొచ్చింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే డ్రైవర్  అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు ఎమ్మెల్యే శ్రీగణేష్.

►ALSO READ | మున్సిపల్ ఎన్నికల సమయంలో హైదరాబాద్లో ఢిల్లీ సరుకు దొరికింది.. కారులో 84 లిక్కర్ బాటిళ్లు !

ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో ఎమ్మెల్యే మాట్లాడగా..అతను మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలానికి చేరుకొని బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

డ్రైవర్ ను కోరుట్ల డిపోకు చెందిన జక్కుల మల్లేష్ గా గుర్తించారు. మల్లేష్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా… 105 పాయింట్లు వచ్చినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి అతనిని స్టేషన్ కు తరలించారు.
 

©️ VIL Media Pvt Ltd.