Reading Time: < 1 minute

రెజ్లింగ్లో మూడు పతకాలు

Caption of Image.

ఆసియా క్రీడల రెజ్లింగ్‌‌లో ఇండియన్‌‌ రెజ్లర్లు మరోసారి పట్టు చూపెట్టారు. అమన్‌‌ సెహ్రావత్‌‌ గోల్డ్, ఆంటిమ్‌‌ పంగల్‌‌ సిల్వర్‌‌, దీపక్‌‌ పూనియా బ్రాంజ్‌‌ మెడల్‌‌ను సొంతం చేసుకున్నారు. శనివారం జరిగిన మెన్స్‌‌ 57 కేజీల ఫైనల్లో అమన్‌‌ 10-7తో వరల్డ్‌‌ చాంపియన్‌‌ చోంగ్‌‌ సాంగ్‌‌ హన్‌‌ (ఉత్తర కొరియా)పై గెలిచాడు. బౌట్‌‌ ఆరంభంలో డిఫెన్స్‌‌ వైఖరితో అమన్‌‌ నిరాశ చెందాడు. కొరియన్‌‌ ఎదురుదాడులను నివారించేందుకు పదేపదే చేతులను బంధించాడు. 

అయితే మొదటి స్కోరింగ్ మూవ్‌‌లో టేక్‌‌ డౌన్‌‌తో స్కోరు 4-1గా మారింది. తర్వాత ఎడమ కాలి దాడిని పాయింట్లుగా మార్చుకుని హాన్‌‌ను మ్యాట్‌‌పైకి విసిరి 6-1 ఆధిక్యంలో నిలిచాడు. ఎడమ మోకాలి చికిత్స తర్వాత హాన్‌‌ పుంజుకునే ప్రయత్నం చేసినా అమన్‌‌ అడ్డుకున్నాడు. వరుసగా మూడు స్కోరింగ్‌‌ మూవ్‌‌లను సాధించి 7-6తో ఆధిక్యాన్ని కొనసాగించాడు. తర్వాత మరో రెండు టేక్‌‌ డౌన్‌‌లతో 10-7తో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. విమెన్స్‌‌ 53 కేజీ ఫైనల్లో ఆంటిమ్‌‌ 1-9తో మో మియుకా (జపాన్‌‌) చేతిలో ఓడి రెండో ప్లేస్‌‌తో సరిపెట్టుకుంది. 

జపాన్‌‌ రెజ్లర్‌‌ ఆంటిమ్‌‌కు బలంగా దాడి చేసే చాన్స్‌‌ ఇవ్వలేదు. రెండో పీరియడ్‌‌లో ఆంటిమ్‌‌ కుడి కాలుతో దాడికి ప్రయత్నించగా, మియుకా వేగంగా స్పందించి 5-1 వద్ద నాలుగు పాయింట్లు నెగ్గింది. దాంతో స్కోరు 9-1గా మారింది. మెన్స్‌‌ 97 కేజీల్లో దీపక్‌‌ 2-1తో గంఖుయాంగ్‌‌ గన్బతార్‌‌ (మంగోలియా)పై గెలిచి కాంస్యం సాధించాడు. 

©️ VIL Media Pvt Ltd.