
హైదరాబాద్: మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్) పట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో భాగ్యనగరంలో ‘పింక్ విక్టరీ రన్ 2026’ (Pink Victory Run 2026) ఘనంగా ప్రారంభమైంది. రోటరీ సంస్థ, మెడికవర్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవగాహన పరుగును నిర్వహిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా ఈ పింక్ విక్టరీ రన్ ను.. 2, 3, 5, 10 కిలోమీటర్ల విభాగాల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరవ్వనున్నారు. క్యాన్సర్‌ను ముందస్తుగానే గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనాలు, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతపై సమాజంలో విస్తృత చైతన్యం తీసుకురావడమే ఈ రన్ ప్రధాన ఉద్దేశం. నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పౌరులు, వైద్యులు, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ రన్‌లో పాల్గొని ఉత్సాహంగా అడుగులు వేశారు.