
Sunday Horoscope October 4 2026: కర్కాటక రాశి వారు నూతన నివాస వసతుల గురించి ఆలోచిస్తారు. కుటుంబ సమావేశాలు సంతోషాన్నిస్తాయి. గతంలో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. ఈరోజు అన్ని శుభవార్తలు వింటారు. ఈరోజు ముకు అనుకూలించే దైవం.. కామాక్షి అమ్మవారు. కామాక్షి స్తోత్రం పారాయణం చేయడం, అమ్మవారికి జాజి పుష్పాలతో అర్చన చేయడం మంచిది. తులా రాశి వారు వివాహాది శుభకార్యాల గురించి ఆలోచనలు మొదలవుతాయి. వ్యాపార భాగస్వామ్య బంధాలు బలపడతాయి. ఆనందకరమైన వార్తలు వింటారు. ప్రజా సంబంధ అంశాల్లో ఆదరణ లభిస్తుంది. సీతాదేవి స్తోత్రం పారాయణం చేయడం మేలు చేస్తుంది.
మేష రాశి వారు నూతన వ్యాపారాలను విస్తరించేందుకు తగిన సమయం కోసం వేచి చూస్తారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితుల సలహాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. దుర్గా కవచం పారాయణం చేయడం మంచిది. భక్తి టీవీ సౌజన్యంతో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 4 అక్టోబర్ 2026 నాటి ద్వాదశ రాశుల దినఫలాలు, అనుకూలించే దైవాలు, ఆయా రాశుల వారు నిర్వహించాల్సిన పూజా విధానాలు కింది వీడియోలో చెప్పారు.