Reading Time: < 1 minute

హైదరాబాద్లో వచ్చే 36 గంటల్లో ఈ ఏరియాల్లో నీళ్లు బంద్ !

Caption of Image.

హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జల మండలి అధికారులు ప్రకటించారు. నాసర్లపల్లి నుంచి గొడకొండ్ల వరకు ఉన్న 2200 మి.మీ. డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌‌‌‌లో దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ టీలు, వాల్వ్లను మార్చే పనులు చేయాల్సి ఉందని వాటర్​బోర్డు అధికారులు తెలిపారు.

ఈ కారణంగా.. హైదరాబాద్ సిటీలోని బాలాపూర్, మైసారం, బార్కాస్, ఎన్‌పీఏ, శంషాబాద్, మధుబన్, ప్రశాసన్‌నగర్‌, బేగంపేట్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఎంఈఎస్, మెట్టుగూడ, వైశాలీనగర్, మీర్‌పేట్, బడంగ్‌పేట్, ఏఆర్‌సీఐ, ఉప్పల్, నాచారం, హెచ్‌ఎంటీ నగర్, తార్నాక, బౌద్ధనగర్, లాలాపేట్, హస్మత్‌పేట్, ప్రకాశ్‌నగర్, మేకలమండి, భోలక్‌పూర్ , పద్మారావునగర్, ఆదిభట్ల, కమ్మగూడ, గుర్రంగూడ, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటో నగర్, అల్కాపురి, రామంతాపూర్, వెంకట్‌రెడ్డి నగర్, బీరప్పగడ్డ, హబ్సిగూడ ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు.

ఈ పనులు అక్టోబర్ 5న సోమవారం ఉదయం 6 గంటల నుంచి మొదలై అక్టోబర్ 6న మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయి. ఈ 36 గంటల కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జల మండలి అధికారులు ప్రకటించారు.

©️ VIL Media Pvt Ltd.