Reading Time: 3 minutes
ఈ రోజు రాశిఫలాలు: ఈ రాశుల వారికి ధనలాభం.. ఉద్యోగంలో పురోగతి.. శుభవార్తలు!

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా చాలావరకు సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినా ఆశిం చిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరికలేని పరిస్థితులు ఉండవచ్చు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. అనవసర ఖర్చుల్ని బాగా తగ్గించుకోవడం మంచిది. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. షేర్లు బాగా లాభిస్తాయి.

 

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు నిలక డగా పురోగమిస్తాయి. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది.  ఒకటి రెండు వ్యక్తిగత సమ స్యలు పరిష్కారం అవుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయి, మానసిక ఒత్తిడి తగ్గు తుంది. గృహ, వాహన సౌకర్యాలకు ప్లాన్ చేస్తారు. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

 

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కొద్దిపాటి శ్రమ, తిప్పటలతో ముఖ్యమైన వ్యవహారా లన్నీ పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఎలాంటి ప్రయత్నమైనా విజయవంతమవుతుంది. బంధువుల వల్ల ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

 

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. ఏ పని తలపెట్టినా నెరవేరుతుంది. ఆర్థిక విషయాలు విజ యవంతంగా సాగిపోతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆర్థిక పరి స్థితి మరింత మెరుగుపడుతుంది.  ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయం పెరుగు తుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఆస్తి వ్యవహారాలను చక్కబెడతారు. కుటుంబసమేతంగా ఆలయాలను సందర్శిస్తారు.

 

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

కుటుంబపరంగా కొద్దిగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆదాయపరంగా, ఉద్యోగపరంగా జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేయడం జరుగు తుంది. ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులతో బాధ్యతలు పంచుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సఫలం అవు తాయి. కుటుంబ పరిస్థితులను బాగా చక్కబెడతారు. ఆస్తి వివాదం ఒకటి సానుకూలపడుతుంది.

 

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ధన స్థానంలో రాశ్యధిపతి బుధ సంచారం వల్ల ఆదాయం పెరగడం, రుణ భారం తగ్గడం వంటివి జరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలను నిర్వహించుకోవడంలో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కొందరు మిత్రులను నమ్మి ఆర్థికంగా నష్టపోతారు. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో పోటీదార్ల నుంచి ఇబ్బందులు ఎదురవు తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుకుంటారు.

 

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

సమయం చాలావరకు అనుకూలంగా గడిచిపోతుంది. ఏ పని ప్రారంభించినా, ఏ ప్రయత్నం తల పెట్టినా తప్పకుండా సఫలమవుతుంది. ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. కొన్ని ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి.

 

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సమస్యల్ని జాగ్రత్తగా పరిష్కరించుకుంటారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

 

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

పెళ్లి ప్రయత్నాల్లో దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి చోటు చేసుకుంటుంది.  ఉద్యోగంలో మార్పులు, చేర్పులు తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగా ల్లోనే కాక, సామాజికంగా కూడా ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయ ప్రయ త్నాలు సత్ఫలితాలనిస్తాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

 

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయంలో ఆశించిన పెరుగుదల కనిపిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు మంచి ఫలితాలని స్తాయి. పెళ్లి ప్రయత్నాలు చాలావరకు సక్సెస్ అవుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగినప్పటికీ, సకాలంలో వాటిని పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా యాక్టివిటీ విస్తరిస్తుంది. అనారోగ్యాల నుంచి చాలావరకు కోలుకుంటారు. జీవిత భాగస్వామికి మంచి అదృష్టం పడుతుంది. పిల్లల పురోగతి గురించి ఆశించిన సమాచారం అందుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

చిన్నా చితకా కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో కాస్తంత ఆచితూచి వ్యవ హరించడం మంచిది. కొద్దిపాటి అనారోగ్యంతో బాధపడే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగి మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలతో సరిపెట్టు కోవాల్సి వస్తుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. సొంత పనులు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం సరదాగా సాగుతుంది.

 

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు దాదాపు పూర్తిగా చక్కబడతాయి. ఆర్థికంగా బాగా కలసి వస్తుంది. వ్యక్తి గత జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. సర్వత్రా మాటకు విలువ పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. పిల్లలు విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.