Reading Time: < 1 minute

హైదరాబాద్‌లో ఇండియన్ సిల్క్ గ్యాలరీ.. చేనేత వస్త్రాల ప్రదర్శన

Caption of Image.

జూబ్లీహిల్స్, వెలుగు: శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ చేనేత వస్త్ర ప్రదర్శనను సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి.సృజన  ప్రారంభించారు. చేనేత కళాకారులకు ప్రోత్సహించడం వారు తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేయాలనే ఉద్దేశంతో ప్రదర్శన ఏర్పాటు చేశారన్నారు. నిర్వాహకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. హైదరాబాద్‌‌‌‌తో పాటు ప్రముఖ నగరాలకు చెందిన చేనేత కళాకారులు తమ ఉత్పత్తులతో ఇక్కడికి వచ్చారని తెలిపారు. ఈ నెల 11వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.  

©️ VIL Media Pvt Ltd.