Reading Time: 2 minutes

మళ్లీ ఢిల్లీకి.. సీఈసీ రాజీనామా చేయకుంటే జంతర్ మంతర్ 2.0: సీజేపీ ప్రకటన

Caption of Image.

మళ్లీ ఢిల్లీలో నిరసన చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) ప్రకటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా  చేయకుంటే అక్టోబర్ 10 నుంచి జంతర్ మంతర్ దగ్గర మరోసారి నిరసనలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈసారి జంతర్ మంతర్ 2.O చూస్తారని హెచ్చరించింది. 

సీఈసీ రాజీనామా డిమాండ్ చేస్తూ ముంబై శివాజీ పార్కు దగ్గర ప్రొటెస్ట్ చేసిన సీజేపీ ప్రతినిధులు.. నిరసనలను రాజధానికి షిఫ్ట్ చేయనున్నట్లు ప్రకటించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దాదాపు నెల రోజుల పాటు ఆందోళనలు చేసి.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయించింది సీజేపీ. అదే క్రమంలో సర్ ప్రక్రియ ఆరోపణలపై సీఈసీ కూడా  రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. 

అక్టోబర్ 10 నుంచి 2.O

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయకుంటే దేశ వ్యాప్తంగా ఉన్న కాక్రోచ్ పార్టీ మద్ధతుదారులు ఢిల్లీ చేరుకుంటారని ఆ పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే హెచ్చరించారు. 

ఢిల్లీలో పోలీసులు అడ్డుకోవాలని చూస్తే.. ఎక్కడ  అడ్డగిస్తారో ఆ స్థలాన్నే జంతర్ మంతర్ చేసుకుని ఆందోళన చేస్తామని అన్నారు. శాంతియుత వాతావరణంలో ఆందోళన చేయడం తమ విధి అని.. అడ్డుకున్నంత మాత్రాన ఆందోళన ఆగదని చెప్పారు. మహాత్మా గాంధీ మార్గంలో శాంతియుతంగా నిరసనలు తెలపడం తమ హక్కు అని అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు తమ శాంతియుత నిరసనలకు సహకరిస్తారో లేక  జులై 20  న జరిగిన క్రూరత్వాన్ని మళ్లీ ప్రదర్శిస్తారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేస్తున్న యుద్ధం అని అన్నారు. నిజాయితీగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కోరుకునే వారు ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

©️ VIL Media Pvt Ltd.