
యూపీఐ ఛార్జీలపై బాదుడు దగ్గర పడుతున్న వేళ గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. చిన్న వ్యాపారులు డిజిటల్ చెల్లింపుల వల్ల ఇబ్బంది లేదుగా బిజినెస్ చేసుకుందా అనుకున్నా అది సాధ్యపడని పరిస్థితులు ఉన్నాయి. ఒక కస్టమర్ గుడ్లు కొనేందుకు షాపుకు వెళ్లగా యజమాని ఇప్పటికి ఓకే సార్ అక్టోబర్ 15 నుంచి మాత్రం క్యాష్ తెచ్చుకోండి సరుకులు కావాలంటే అని చెప్పాడు. అదేంటన్న నేను కొనే అరడజను గుడ్లకు నీకేమీ ఛార్జీలు పడవుగా అని ప్రశ్నిస్తే.. బ్రదర్ హోల్ సేలర్ క్యాష్ లోనే పేమెంట్ అడుగుతున్నారు నేను కూడా ఏమీ చేయలేను క్యాష్ ఇచ్చి కొనుక్కోండి అంటూ వాస్తవ పరిస్థితి గురించి చెప్పాడు. మోడీ సర్కార్ చెప్పిన మాటలు గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి చాలా దూరంగా ఉన్నాయని ఈ ఘటన రుజువు చేస్తోంది.
చిన్న వ్యాపారులపైనే భారం..
యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీల రూల్స్ వల్ల చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఉదాహరణకు.. కోడిగుడ్లు అమ్మే చిరు వ్యాపారి వద్ద జరిగే లావాదేవీలు ఒక నిర్దిష్ట పరిమితిని దాటితే అతనికి కూడా ఎండీఆర్ భారం పడుతుంది. ఈ అదనపు భారాన్ని భరించలేక కొందరు వ్యాపారులు మళ్లీ క్యాష్ లావాదేవీల వైపు మొగ్గు చూపుతున్నారు. బ్యాంకులకు వెళ్లి క్యూ లైన్లలో నిలబడి క్యాష్ తీసుకోవడం ఇష్టం లేక.. నేరుగా కస్టమర్ల నుంచి క్యాష్ రూపంలోనే వసూలు చేయాలని చూస్తున్నారు. ఇది డిజిటల్ ఇండియా లక్ష్యానికి కొంతవరకు ఆటంకం కలిగించే విషయమే.
నిబంధనల్లో సంక్లిష్టత..
వివిధ రంగాలకు వేర్వేరు ఎండీఆర్ రేట్లు ప్రకటించడం వల్ల భవిష్యత్తులో వర్గీకరణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. జీఎస్టీ, వాట్ కాలంలో చూసినట్టుగానే.. లెక్కల్లో తప్పులు, నిబంధనల అమలులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. దీనికి బదులుగా క్రెడిట్, డెబిట్ కార్డుల మాదిరిగా గరిష్ట పరిమితిని విధించి, మార్కెట్ పోటీకి వదిలేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. అప్పుడే కంపెనీలు తక్కువ ధరలకు సర్వీసులు అందించేందుకు ముందుకు వస్తాయి.
వ్యాపారులు ఈ ఎండీఆర్ భారాన్ని నేరుగా వినియోగదారులపై రుద్దకుండా ప్రభుత్వం కఠిన నిఘా పెట్టింది. బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అయితే ముడిసరుకుల ధరలు, వేతనాలు పెరిగినప్పుడు వ్యాపారులు తమ ఉత్పత్తుల ధరలను పెంచుకోవడం సహజం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ధరల నియంత్రణపై అనవసరంగా జోక్యం చేసుకుంటే వ్యాపార వర్గాలకు మరింత భారంగా మారుతుంది. ఏది ఏమైనప్పటికీ.. మారుతున్న నిబంధనల కారణంగా చిన్న వ్యాపారులకు తగిన వెసులుబాటు కల్పించి, డిజిటల్ లావాదేవీలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.