Reading Time: 2 minutes
Janhvi Kapoor : తప్పకుండా చర్యలు తీసుకుంటాం.. చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్..

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఏఐ వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి ప్లాట్ ఫామ్స్ లో ఏదోక విషయంపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కంటెంట్ వైరల్ అవుతుంది. అయితే ఈ సాంకేతికతను కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేయడం మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి హీరోహీరోయిన్స్ చిత్రాలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడం ఇటీవల కాలంలో ఎక్కువైందే. అయితే కేవలం కథానాయికల చిత్రాలు కాదు.. ఇప్పుడు దేవర చిత్రంలోని చుట్టమల్లే పాటను సైతం ఏఐ ఉపయోగించి అసభ్యకరంగా సృష్టించారు. ఇప్పుడు ఈ విషయం సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‏తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..

ఇప్పటికే ఈ ఏఐ వీడియోపై మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఇక ఇప్పుడు ఈ వివాదం పై హీరోయిన్ జాన్వీ కపూర్ సైతం స్పందించింది. ఏఐ టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం కలవరపాటుకు గురిచేస్తోందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్.. ఒక్క పాటతో గెల్డోన్ బ్యూటీగా మార్చిన రాఘవేంద్రరావు.. ఇప్పటికీ ఆమె తోపు యాక్టర్..

“ఏఐ ద్వారా సృష్టించిన ఇలాంటి నకిలీ వీడియోలను దయచేసి ఎవరూ క్రియేట్ చేయవద్దు, ఇతరులతో షేర్ చేయవద్దు లేదా ప్రచారం చేయవద్దు ” అని ట్వీట్స్ చేశారు. ఇది ఏఐ టెక్నాలజీని స్పష్టంగా దుర్వినియోగం చేయడమేనని, ఈ వికృత చేష్టలకు పాల్పడిన వారిపై ఖచ్చితంగా తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గట్టి హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం జాన్వీ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..

జాన్వీ ట్వీట్..

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార..