Reading Time: < 1 minute

తిరుపతి శ్రీసిటీలోని హెల్త్ కేర్ పరిశ్రమలో పేలుడు.. నలుగురు మృతి

Caption of Image.

తిరుపతి శ్రీ సిటీ హెల్త్ కేర్ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. సత్యవేడు మండలం శ్రీసిటీ పరిధిలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో పులుడు సంభవించింది. 2026 అక్టోబర్ 3వ తేదీన జరిగిన ఈ ప్రమాదంలో నలుగరు మృతి చెందగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

 ప్రమాద సమయంలో 30 మంది కార్మికులు ఉన్నట్లు చెప్పారు. బాయిలర్ ఒక్కసారిగా పేలుడుతో ప్రమాదం జరిగింది. నైట్ షిఫ్ట్ నుంచి విధుల్లో ఉన్న పలువురు కార్మికులు పేలుడులో చిక్కుకున్నట్లు చెబుతున్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను శ్రీసిటీలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.  

©️ VIL Media Pvt Ltd.