
హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో అమిత్ షా టూర్ క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలంగాణ బీజేపీ వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3, 4వ తేదీల్లో రెండు రోజుల పాటు అమిత్ షా తెలంగాణలో పర్యటించాల్సి ఉంది.
అమిత్ షా షెడ్యూల్ ఇదే
అక్టోబర్ 3న రాత్రికి హైదరాబాద్కు చేరుకుని హోటల్ కాకతీయలో బస చేయనున్న ఆయన.. అక్టోబర్ 4న ఉదయం మెదక్ జిల్లాకు బయలుదేరతారు. తూప్రాన్ పరిధిలోని ఉర్జా ఇండస్ట్రియల్ పార్కులో ‘సబర్ డెయిరీ ప్రాజెక్ట్ మిల్క్ ప్లాంట్’ శంకుస్థాపనలో పాల్గొని, డెయిరీ రంగానికి సంబంధించి కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
మెదక్ టూర్ ముగిసిన వెంటనే ఆయన హెలికాప్టర్ ద్వారా కరీంనగర్కు చేరుకుంటారు. అక్కడ నాగనూర్ రోడ్డులోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ వేడుకల్లో షా ముఖ్య అతిథిగా హాజరవుతారు.
ALSO READ : కేరళలో బీజేపీకి బిగ్ షాక్.. కౌన్సిలర్ పదవికి మాజీ డీజీపీ శ్రీలేఖ రాజీనామా
ఈ వేడుకల అనంతరం సాయంత్రం కరీంనగర్ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుగుప్రయాణం కానున్నారు. అమిత్ షా పర్యటనకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో అమిత్ షా తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నారు.