
సీఎం విజయ్ తనయుడి డెబ్యూ మూవీ అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ‘సిగ్మా’ థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ హైప్‌కు తగ్గ ఓపెనింగ్ కనిపించలేదు. సందీప్ కిషన్, ఫారియా అబ్దుల్లా జంటగా నటించిన యాక్షన్-కామెడీ హీస్ట్ ‘సిగ్మా’కు ఆశించిన స్థాయిలో బజ్ కనిపించలేదనే టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలిరోజే స్లో స్టార్ట్ తీసుకుంది.
ట్రేడ్ లెక్కల ప్రకారం.. ‘సిగ్మా’ ఇండియాలో తొలిరోజు రూ.2.35 కోట్ల నెట్ మాత్రమే రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇండియా గ్రాస్ దాదాపు రూ.2.70 కోట్లుగా నమోదైందని తెలిపాయి. మరోవైపు సినిమాకు వస్తున్న రివ్యూలు, ఆడియన్స్ రెస్పాన్స్ కూడా మిక్స్‌డ్‌గా ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సందీప్ కిషన్ పెర్ఫార్మెన్స్, కొన్ని యాక్షన్, కామెడీ సన్నివేశాలకు ప్రశంసలు వస్తుండగా.. కథనం, స్క్రీన్‌ప్లే, ఎగ్జిక్యూషన్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక తొలి రోజు కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ‘సిగ్మా’కు ఇప్పుడు వీకెండ్ అత్యంత కీలకంగా మారింది. శనివారం, ఆదివారం వసూళ్లు పుంజుకుంటే సినిమా బాక్సాఫీస్ రన్‌ను నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇదే తరహా రెస్పాన్స్ కొనసాగితే మాత్రం థియేట్రికల్ రన్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. మరి జేసన్ సంజయ్ డెబ్యూ మూవీ వీకెండ్‌లో పుంజుకుని బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందా? లేక తొలి రోజు ట్రెండ్‌నే కొనసాగిస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
తెలుగు, తమిళ వసూళ్ల పరిస్థితి..
భాషల వారీగా చూస్తే తమిళ వెర్షన్‌దే పైచేయిగా కనిపిస్తుంది. తొలి రోజు తమిళంలో రూ.1.50 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చింది. 925 షోలకు కలిపి 50.10 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక తెలుగు వెర్షన్ రూ.85 లక్షల నెట్ వసూలు చేసింది. 888 షోలకు కలిపి 25.94 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. మొత్తంగా దేశవ్యాప్తంగా ‘సిగ్మా’ 1,813 షోల ద్వారా 2.21 లక్షలకు పైగా ఫుట్‌ఫాల్స్ నమోదు చేసుకుంది. ఓవరాల్ ఆక్యుపెన్సీ 31.10 శాతంగా ఉంది.
‘సిగ్మా’ కథ ఏంటి?
సందీప్ కిషన్ ఇందులో గురు అనే లైబ్రేరియన్ పాత్రలో కనిపించాడు. తల్లి జ్ఞాపకాలతో ముడిపడిన పాత లైబ్రరీని కాపాడుకోవడానికి ప్రయత్నించే గురు భారీ అప్పుల్లో చిక్కుకుంటాడు. అప్పులు తీర్చుకోవడానికి డబ్బు సంపాదించే ప్రయత్నంలో అతడు డ్రగ్స్, అక్రమ క్యాసినోలు, గ్యాంగ్‌స్టర్లతో ముడిపడిన రూ.500 కోట్ల భారీ క్రైమ్ రాకెట్ గురించి తెలుసుకుంటాడు.
ఈ డబ్బును దక్కించుకోవడానికి గురు తన స్నేహితులతో కలిసి ఓ భారీ హీస్ట్ ప్లాన్ వేస్తాడు. అయితే ఈ ప్లాన్‌లో గ్యాంగ్‌స్టర్లు, క్యాసినో నిర్వాహకులు, డబుల్ క్రాసులు, ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఫారియా అబ్దుల్లా సామ్ అనే RJ పాత్రలో కనిపిస్తుంది. గురు తన అప్పులను తీర్చుకుని లైబ్రరీని కాపాడుకోగలిగాడా? ఆ రూ.500 కోట్ల వెనుక ఉన్న క్రైమ్ నెట్‌వర్క్‌ను ఎలా ఎదుర్కొన్నాడు? అన్నదే సినిమా ప్రధాన కథ.