Reading Time: 2 minutes
India 211 6 Abhishek Sharma 61 Tilak Varma 51 Asian Games Final

India vs Pakistan: ఏషియన్ గేమ్స్ 2026 క్రికెట్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. పాకిస్థాన్‌కు 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కాటేరమ్మకొడుకు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ హాఫ్ సెంచరీలతో అదరగొట్టేశారు. మ్యాచ్ ప్రారంభంలో అభిషేక్ 28 బాల్స్‌లో 61 పరుగులు చేసి పాకిస్థాన్‌కు చుక్కులు చూయించాడు. చివర్లో తిలక్ వర్మ(51) బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

ఇక, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ తొలుత బ్యాటింగ్ బరిలోకి దిగారు. ఈ జోడీ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించింది. అయితే, వైభవ్ తన ఇన్నింగ్స్‌ను పొడిగించలేకపోయాడు. సామ్ అయూబ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ క్యాచ్ పట్టడంతో అతను అవుటయ్యాడు. వైభవ్ 9 బంతుల్లో రెండు సిక్సర్లతో 15 పరుగులు చేశాడు. వైభవ్ అవుటయ్యే సమయానికి స్కోరు 28/1గా ఉంది. వైభవ్ తరువాత బ్యాటింగ్‌కి వచ్చిన సంజూ శామ్సన్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. అహ్మద్ డానియల్ బౌలింగ్‌లో కేవలం 2 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. దీంతో అభిషేక్ శర్మ దుమ్మురేపేశాడు. 20 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కానీ, 61 పరుగుల వద్ద అభిషేక్ ఇన్నింగ్స్ ముగిసింది. తన ఇన్నింగ్స్‌లో 28 బంతులు ఆడిన అభిషేక్, 3 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 217గా నమోదైంది. అరాఫత్ మిన్హాస్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖాన్ అతడిని స్టంప్ చేయడంతో అభి పెవిలియన్‌కు చేరాడు. ఇక బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ అరఫత్ మిన్హాస్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 18 బంతుల్లో 3 ఫోర్లు బాది.. 20 పరుగులు చేసి వెనుదిరిగాడు.

ఇక అప్పటి వరకు నిలకడగా ఆడిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. శ్రేయస్ 24 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. మ్యాచ్ మధ్యలో టీమిండియా కాస్త తడబడింది. అభిషేక్ శర్మ అవుటైనప్పుడు, 7.5 ఓవర్లలో భారత జట్టు స్కోరు 3 వికెట్ల నష్టానికి 93 పరుగులకు చేరింది. ఆ తర్వాత, 14.1 ఓవర్లలో శ్రేయస్ అవుటైనప్పుడు, టీమ్ ఇండియా స్కోరు 5 వికెట్ల నష్టానికి 133 పరుగులకు చేరింది. చివరి ఓవర్లలో శివమ్ దూబే, తిలక్ వర్మ తరఫున వేగవంతమైన ఇన్నింగ్స్‌ ఆడారు. అహ్మద్ డానియల్ బౌలింగ్‌లో దూబే క్యాచ్ అవుట్ అయ్యాడు. దూబే 15 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 27 పరుగులు చేశాడు. తిలక్ వర్మ ఎట్టకేలకు 22 బంతుల్లో 51 పరుగులు పూర్తి చేసి టీమిండియాకి చేయూతనందించాడు.