
ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానంలో ఊహించని విపత్తు ముంచుకొచ్చినప్పుడు.. ఒక పైలట్ చూపిన అసాధారణ ధైర్యసాహసాలు 174 మంది ప్రాణాలను కాపాపబడ్డాయి. దుబాయ్ నుండి ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్ 1073లో జరిగిన భయానక ఘటన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.
ఈ విమాన ప్రయాణంలో కో-పైలట్ అయిన హమామ్ అల్-హమ్మమి ఒక్కసారిగా భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. విమానాన్ని కూల్చివేయాలనే అతని కుట్రను స్మిత్ మచ్ఛర్ తన ప్రాణాలను పణంగా పెట్టి తిప్పికొట్టారు. తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికీ.. ఏమాత్రం సంయమనం కోల్పోకుండా పోరాడి కాక్‌పిట్ తలుపు తెరిచారు మచ్ఛర్. దీంతో ప్రయాణికులు వెంటనే స్పందించి నిందితుడిని కట్టడి చేశారు. ఆ తర్వాత విమానాన్ని సురక్షితంగా సౌదీ అరేబియాలోని తబుక్ నగరంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.
ఈ అసాధారణ సాహసానికి దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా ప్రశంసల వెల్లువ కురిసింది. భారతీయ పైలట్ చూపిన తెగువకు గుర్తింపుగా భారత ఫార్మా దిగ్గజం ‘మ్యాన్ కైండ్ ఫార్మా’ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ అసాధారణ ధైర్యం, బాధ్యతా భావానికి గౌరవ సూచకంగా రూ.కోటి నజరానాను ప్రకటించింది. నిజమైన నాయకుడు సంక్షోభ సమయంలోనే పరీక్షించబడతాడు అని మాంకిండ్ ఫార్మా ఎండీ రాజీవ్ జునేజా ఇండియన్ పైలెట్ వీరోచిత పోరాటాన్ని కొనియాడారు.
Capt. Smit Machchhar put his crew and every passenger before himself. That is true leadership. As a humble gesture of gratitude, Mankind Pharma is contributing ₹1 crore to him and his family. You have made India proud. We salute you. 🇮🇳 #CaptSmitMachchhar https://t.co/75pdk5iZqn
— Mankind Pharma (@Pharma_Mankind) October 2, 2026
ఈ ఘటనపై ప్రధాని మోడీ స్వయంగా కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌తో ఫోన్ లో మాట్లాడి అతని సాహసాన్ని అభినందించారు. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సులేట్ జనరల్ కూడా ఆయనను “నిజమైన హీరో” గా అభివర్ణించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైట్స్ ఆయనకు అత్యున్నత జాతీయ అవార్డును ప్రదానం చేయాలని కేంద్రం ప్రభుత్వాన్ని కోరింది. గాయపడి కోలుకుంటున్న స్మిత్ మచ్ఛర్ ప్రస్తుతం దేశానికి గర్వకారణంగా నిలిచారు. తన ప్రాణం పోతున్నా వందల మంది ప్రాణాలను కాపాడేందుకు చేసిన సాహసం హిస్టరీగా మారింది.