Reading Time: < 1 minute

ఆదిలాబాద్ జిల్లా అరేపల్లిలో పత్తి పంటలో గంజాయి సాగు… రూ. ఐదు లక్షల విలువైన మొక్కలు సీజ్..

Caption of Image.

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం అరేపల్లిలో యథేచ్ఛగా గంజాయి తోటలు సాగు చేస్తున్నారు. శనివారం ( అక్టోబర్ 3 ) అరేపల్లి గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులు రూ. 5 లక్షల విలువైన 51 గంజాయి మొక్కలు సీజ్ చేశారు. గంజాయి మొక్కలు సాగు చేస్తున్నా వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడు పత్తి పంటలో గంజాయిని అంతర సాగు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు 

ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. గంజాయి సాగు చేస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు.ఇదిలా ఉండగా.. గురువారం ( అక్టోబర్ 1 ) ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం రేపింది. ఓయూలోని ఎన్ఆర్ఎస్ హాస్టల్ నుంచి హబ్సిగూడ వెళ్లే రూట్లో ఈ మొక్క ఒకరికి కనబడడంతో వారు మీడియాకు సమాచారం అందించారు. 

దీంతో మీడియా, ఉస్మానియా యూనివర్సిటీ సెక్యూరిటీ, ఓయూ పోలీసులు మొక్క ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. విద్యార్థులు చదువుకునే క్యాంపస్లో గంజాయి మొక్క ఎలా పెరిగిందని అనుమానాలు వ్యక్తం చేశారు. వెంటనే ఓయూ సెక్యూరిటీ ఆ మొక్కను పీకి పడేశారు. 

ఈ మొక్క సహజంగా మొలిచిందా? లేక ఎవరైనా నాటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్యాంపస్లో ఇలాంటి మొక్కలు మరెక్కడైనా ఉన్నాయా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

©️ VIL Media Pvt Ltd.