Reading Time: < 1 minute
APPSCలో ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.1.54 లక్షల వరకు జీతం

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు మరో ఉద్యోగ అవకాశాన్ని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ఫ్యాక్టరీస్‌ సర్వీస్‌లో ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 12 ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్‌ 13, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కెమికల్‌ లేదా ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. పూర్తి అర్హతలు, అనుభవ నిబంధనలను అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.

అర్హులైన అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 2, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో విద్యార్హతలు, పని అనుభవానికి సంబంధించిన వివరాలను సరిగ్గా నమోదు చేయాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లికేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది. అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో ఉంటుంది. ముందుగా కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (CBRT) నిర్వహిస్తారు. ఇందులో ఆబ్జెక్టివ్‌ టైప్‌ క్వాలిఫైయింగ్‌ టెస్ట్‌తో పాటు రెండు పేపర్లు ఉంటాయి. అనంతరం అర్హత సాధించిన అభ్యర్థులకు వాకింగ్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ (CPT) నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.65,360 నుంచి రూ.1,54,980 వరకు జీతంగా చెల్లిస్తారు.

మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కెమికల్‌, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో డిగ్రీతో పాటు అవసరమైన పని అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలు, అనుభవం, వయోపరిమితి, పరీక్ష విధానం, ఇతర నిబంధనలను పూర్తిగా పరిశీలించాలి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 13, 2026.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 2, 2026.
  • ఖాళీల సంఖ్య: 12
  • జీతం: రూ.65,360 నుంచి రూ.1,54,980 వరకు

ఏపీపీఎస్సీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.