Reading Time: < 1 minute

టాస్ గెలిచిన టీమిండియా.. వెస్టిండీస్ బౌలర్లను ఎదుర్కోనున్న భారత బ్యాటర్లు

Caption of Image.

భారత క్రికెట్ అభిమానులకు ఈ రోజు డబుల్ ధమాకా లభించింది. ఒకవైపు జపాన్‌లోని నిస్షిన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలలో (Asian Games 2026) పురుషుల క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా.. మరోవైపు అంతర్జాతీయ మ్యాచ్‌లో భాగంగా వెస్టిండీస్‌తో పోరుకు భారత జట్టు సిద్ధమైంది. ఈ పోరులో టీమిండయా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. న్యూ చండీగఢ్ పిచ్ బ్యాటింగ్‌కు అత్యంత అనుకూలంగా ఉంటుందని, అయితే మ్యాచ్ ప్రారంభంలో కొత్త బంతితో సీమర్లకు కొంత మూవ్‌మెంట్ లభించే అవకాశం ఉందని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేర్కొన్నారు. కాగా ఈ మ్యాచులో రెండు మార్పులు చేసినట్లు ఇండియన్ కెప్టెన్ పేర్కొన్నారు. తుది జట్టులోకి నితీశ్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్ వచ్చారు. 

వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ మాట్లాడుతూ.. తాము టాస్ గెలిస్తే బౌలింగ్ చేయాలనుకున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుతో ఆడుతుండటం తమ యువ ఆటగాళ్లకు గొప్ప అనుభవమని, జట్టులో మూడు మార్పులు చేశామని వెల్లడించారు. బ్యాటింగ్‌లో మరింత స్థిరత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.  

ఇరు జట్లు: 

భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్.

వెస్టిండీస్ జట్టు: జాన్ క్యాంప్‌బెల్, జ్యూవెల్ ఆండ్రూ, షాయ్ హోప్ (కెప్టెన్), అమీర్ జాంగూ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, కీమో పాల్, మాథ్యూ ఫోర్డే, గుడకేష్ మోతీ, అల్జారీ జోసెఫ్, విటెల్ లావ్స్, జైడన్ సీల్స్.

©️ VIL Media Pvt Ltd.