
జెరూసలెం: ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ‘ఫ్లైదుబాయ్’ ఫ్లైట్‌ను కూల్చేందుకు ప్రయత్నించిన కోపైలట్ వెనుక ఇరాన్ ప్రమేయం ఉన్నట్లు తేలితే, ఆ దేశంపై అత్యంత తీవ్రంగా దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఈ ఫ్లైట్ లో 180 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. విమానంలో కోపైలట్ కెప్టెన్‌పై కత్తితో దాడి చేశాడు.
వెంటనే ప్రయాణికులు, సిబ్బంది అప్రమత్తమై ఆ దాడిని అడ్డుకుని సౌదీ అరేబియాలో సేఫ్‌గా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఎటాక్వెనుక ఇరాన్ పాత్రపై ట్రంప్అనుమానం వ్యక్తంచేశారు. ‘ప్రస్తుత సమాచారం ప్రకారం పైలట్‌కు టెహ్రాన్‌తో (ఇరాన్) సంబంధాలు ఉన్నట్లు అనిపిస్తోంది. మేము విచారణ జరుపుతున్నం. ఇరాన్ ప్రమేయం ఉన్నట్లు తేలితే ఆ దేశంపై తీవ్రంగా దాడి చేస్తం’ అని ట్రంప్ హెచ్చరించారు.