Reading Time: < 1 minute
Fahadh Faasil: చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నా.. అందుకే ఇలా.. ఫహాద్‌ ఫన్నీ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందమైన జోడీల్లో ఫహాద్‌ ఫాజిల్‌, నజ్రియా నజీమ్‌ జంట కూడా ఒకటి. 2014లో పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఆ మధ్యన వీరు విడాకుల తీసుకుంటున్నారని వార్తలు వచ్చినా అవి రూమర్లుగానే మిగిలిపోయాయి. ఇక ఫహాద్‌ ఫాజిల్‌, నజ్రియా నజీమ్‌లది ప్రేమ వివాహం. వీరు ‘బెంగళూరు డేస్‌’ సినిమాలో భార్యాభర్తలుగా నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత ఇరు పెద్దల ఆశీర్వాదంతో 2014లో పెళ్లిపీటలెక్కారు. అప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. అయితే అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో ఫహాద్- నజ్రియా సరదాగా చేసే వ్యాఖ్యలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుటాయి. అలా తాజాగా మరోసారి తన భార్య నజ్రియాపై క్రేజీ కామెంట్స్ చేశాడు ఫహాద్. ఫాజిల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’. శశాంక్‌ యేలేటి తెరకెక్కించిన ఈ సినిమాలో , సారా పాలేకర్‌, సౌరభ్‌ సచ్దేవ్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 02న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫహాద్ ఫాజిల్ తన భార్య నజ్రియాను ప్రస్తావిస్తూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. తాను ఓ చిన్నపిల్ల లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని.. అందుకే పిల్లలను చూసుకోవడంలో తనకు చాలా ఓపిక అంటూ చెప్పుకొచ్చాడు ఫహాద్. ఇంత ఓపిక ఎక్కడిదిని కొందరు తనను అడుగుతుంటారని చెప్పిన ఫహాద్.. ఆ ఓపిక.. ఇంట్లో తన భార్యను చూసుకోవడంతో వచ్చిందటూ కామెడీగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరో సారి ఈ జోడీని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆటోడ్రైవర్‌తో మహిళల ఫైట్‌.. నడిరోడ్డుపై జుట్టుపట్టి వీరంగం

ఫిట్‌నెస్సే నా అసలు రహస్యం.. మనసు ప్రశాంతంగా ఉంటేనే రికార్డుల మోత

పొలానికి వెళ్లిన రైతు.. దూరంగా కనిపించినది చూసి హడలిపోయి..

ప్రయాణికులకు అలర్ట్! ఇకపై రైల్లో ప్రయాణిస్తే అవి తప్పనిసరి!

విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..