Reading Time: < 1 minute
యూత్ టార్గెట్ గా వివో ఎస్ 2 ఎఫ్ఈ.. ధర, ఫీచర్లతో మార్కెట్లో హిట్ పెంచుతోంది

కొత్త మొబైల్‌లో ఇప్పటివరకు వివో ఫోన్లలో అందించిన వాటిలోనే అత్యధిక బ్యాటరీ సామర్థ్యం ఉంటుందని కంపెనీ చెబుతోంది. సోషల్ మీడియా వినియోగం, కంటెంట్ తయారీ, ఫొటోలు, వీడియోల కోసం దీన్ని ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపింది. స్లిమ్ ప్రొఫైల్‌తో వచ్చే ఈ ఫోన్ రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఉంటుందని కంపెనీ టీజర్ల ద్వారా సూచించింది.

ఇమర్సివ్ డిస్‌ప్లే

vivo S2 FEలో భారీ బ్యాటరీతో పాటు ఇమర్సివ్ డిస్‌ప్లేను అందించనున్నారు. అయితే బ్యాటరీ సామర్థ్యం, డిస్‌ప్లే పరిమాణం, రిజల్యూషన్, రిఫ్రెష్ రేట్ వంటి పూర్తి వివరాలను వివో ఇంకా వెల్లడించలేదు. యువత ఎక్కువగా ఉపయోగించే సోషల్ మీడియా, వీడియో కంటెంట్, ఫొటోగ్రఫీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫోన్‌ను తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. సన్నని డిజైన్‌ ఈ మొబైల్‌కు మరో ప్రత్యేకతగా ఉండనుంది.

డ్యూయల్ కెమెరా..

కంపెనీ విడుదల చేసిన టీజర్లలో “My New Story” అనే ట్యాగ్‌లైన్‌ను హైలైట్ చేసింది. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నట్లు ప్రమోషనల్ చిత్రాల ద్వారా వెల్లడించింది. సాఫ్ట్‌వేర్ పరంగా OriginOSతో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. Flipkart, vivo India ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయించనున్నారు. ప్రస్తుతం ధర, ర్యామ్-స్టోరేజ్ వేరియంట్లు, కెమెరా సామర్థ్యం, బ్యాటరీ పరిమాణం, సేల్ తేదీ వంటి కీలక వివరాలు తెలియాల్సి ఉంది. అక్టోబర్ 6న మధ్యాహ్నం 12 గంటలకు జరిగే లాంచ్ కార్యక్రమంలో వివో వీటిని అధికారికంగా ప్రకటించనుంది.