
నరసరావుపేట: ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ కడుపులో 14 పెన్నులు, 5 చెక్క స్పూన్లు, ఒక క్యాండిల్ను పోలీసులు గుర్తించారు. కడుపు నొప్పి వస్తుండటంతో స్కానింగ్ చేసి చూడగా డాక్టర్లు వీటన్నింటినీ కడుపులో చూసి విస్తుపోయారు.
లాప్రోస్కోపీలో ఆపరేషన్ చేసి వాటిని వైద్యులు తొలగించారు. బాధిత మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అసలు.. ఆ మహిళ అన్ని వస్తువులు ఎందుకు మింగిందో, ఎలా మింగిందో.. మింగే సమయంలో గొంతుకు అడ్డం పడకుండా ఎలా ఉన్నాయో అర్థం కాని పరిస్థితి.