Reading Time: < 1 minute

టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న వెస్టిండీస్.. భారత జట్టులో రెండు మార్పులు

Caption of Image.

IND vs WI: భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా మూడో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి లీడ్ సాధించాలని ఇరు జట్లు ఎంతో పట్టుదలగా ఉన్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ మరోసారి ఫీల్డింగ్ (బౌలింగ్) తీసుకున్నాడు. దీంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్‌కు రంగంలోకి దిగనుంది. ఈ మ్యాచులో ఇండియా రెండు మార్పులతో బరిలోకి దిగబోతుంది. 

భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. టీమిండియా జట్టులో రెండు మార్పులు చేశాం.. శివమ్ దూబే స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి జట్టులోకిరాగా.. కుల్దీప్ యాదవ్ స్థానంలో యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ తుది జట్టులోకి అడుగుపెట్టాడు. పిచ్ పరిస్థితులు, డెత్ ఓవర్లలో యార్కర్లు వేయగల బౌలర్ల అవసరం ఉండటంతో ఈ మార్పులు చేసినట్లు శ్రేయస్ తెలిపాడు.   

వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ మాట్లాడుతూ.. గత మ్యాచ్‌లో రికార్డు ఛేదన సాధించిన విండీస్ జట్టులోనూ మూడు మార్పులు చేసినట్లు కెప్టెన్ హోప్ వెల్లడించాడు. ముఖ్యంగా రోమారియో షెఫర్డ్ ఈ మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్నాడని పేర్కొన్నాడు. 

ఇరు జట్లు: 

వెస్టిండీస్: షాయ్ హోప్ (కెప్టెన్/ వికెట్ కీపర్), కమిల్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, క్వెంటిన్ సాంప్సన్, కీమో పాల్, షమర్ స్ప్రింగర్, రోస్టన్ చేజ్, గుడాకేష్ మోటీ, షమర్ జోసెఫ్

భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్   

©️ VIL Media Pvt Ltd.