Reading Time: < 1 minute

Kobali Song: ‘రణబాలి’ నుంచి పవర్‌ఫుల్ సెకండ్ సింగిల్ ‘కొబలి’.. పౌరుషాన్ని చాటుతున్న విజయ్ దేవరకొండ పాట

Caption of Image.

విజయ్ దేవరకొండ నటించిన ‘రణబాలి’ సినిమా నుంచి రెండో పాట ‘కొబలి’ (Kobali) తాజాగా విడుదలైంది. కేశవాదిత్య అందించిన పవర్‌ఫుల్ లిరిక్స్‌కు అజయ్–అతుల్ అందించిన ఇంపాక్ట్‌ఫుల్ మ్యూజిక్ తోడవడంతో ఈ పాట వీరత్వానికి, తెగువకు, పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోంది.

“రేగే ఉరుము తరుము మిన్ను ముట్టగా.. అష్టదిక్కులే పిక్కటిల్లవా..” అంటూ మొదలయ్యే సాహిత్యం పాటకు అదిరిపోయే ఇంటెన్సిటీని తీసుకొచ్చింది.  “జోగే రెయ్యిలోన.. పగలు సెగలిలా.. పొగులుతుండగా .. పగలు పుట్టదా.. మూగే సావునైనా సంపడానికి.. సత్తువియ్యరా.. కాలకాలుడ.. పెన్నేరల్లే తేరు ఉరకలెత్తగా.. సింధు తొక్కామా.. భద్రమళ్లడా..” ఇలా ప్రతి పదంలోనూ కనిపించే పౌరుషం, పోరాట స్ఫూర్తి ‘కొబలి’ పాటను మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. మొత్తంగా చరిత్రలోని వీరత్వాన్ని, ప్రతీకార జ్వాలను, మట్టిలో దాగిన తెగువను తనదైన శైలిలో ఆవిష్కరించేలా ఈ పాట సాగింది.

ముఖ్యంగా అజయ్–అతుల్ అందించిన బలమైన ట్యూన్ పాటకు మరో స్థాయి ఎనర్జీని తీసుకొచ్చింది. కేశవాదిత్య లిరిక్స్ ‘రణబాలి’ ప్రపంచంలోని తీవ్రతను, కథలోని సంఘర్షణను ప్రతిబింబిస్తున్నాయి. వినే ప్రతి ఒక్కరిలోనూ ఉత్సాహాన్ని రగిలించేలా ఉన్న ఈ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన తొలి పాట ‘ఏందయ్యా సామీ’తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుకున్న ‘రణబాలి’, ఇప్పుడు ‘కొబలి’తో మరోసారి వార్తల్లో నిలుస్తోంది. పవర్‌ఫుల్ లిరిక్స్, ఇంపాక్ట్‌ఫుల్ మ్యూజిక్‌తో ఆకట్టుకుంటున్న ఈ సెకండ్ సింగిల్ వినేయండి.‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.. 

©️ VIL Media Pvt Ltd.