
- ఎలాంటి మొహమాటం పెట్టుకోవద్దు
- కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
- అంబర్‌పేట నియోజకవర్గంలో పర్యటన
అంబర్పేట్, వెలుగు : స్కూల్స్ డెవలప్మెంట్, విద్యార్థుల అవసరం కోసం ఏం కావాలన్నా తక్షణమే సమకూరుస్తానని, ఎలాంటి మొహమాటం లేకుండా అడగాలని విద్యార్థులు, ఉపాధ్యాయులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం అంబర్పేట్ నియోజకవర్గంలోని పటేల్ నగర్ లో ఉన్న (సీపీఎల్) కమాండో పోలీస్ ల్యాండ్ స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి అక్కడి సదుపాయాలను పరిశీలించారు.
తర్వాత అంబర్పేట్పోలీస్ బాయ్స్ హై స్కూల్ లో కొత్తగా కట్టిన క్లాస్‌రూమ్స్‌ను ప్రారంభించారు. తర్వాత స్టూడెంట్స్‌తో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. మంత్రి మాట్లాడుతూ కస్తూరి రంగన్ నేతృతంలో నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలులో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.
స్వచ్ఛభారత్ స్ఫూర్తితో జనాల్లో చాలా మార్పు వచ్చిందని, అయినా, ఇంకా 75 శాతం మార్పు రావాల్సి ఉందన్నారు. ఇంకా చెత్తను కాలువల్లో వేస్తున్నారని డస్ట్ బిన్ లో వేసే అలవాటు తరగతి గది నుంచే రావాలని పిలుపునిచ్చారు.