Reading Time: < 1 minute

స్పష్టమైన హామీ ఇవ్వకుంటే రేపటి నుంచి దీక్షలు : తెలంగాణ రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు గణపతి రెడ్డి

Caption of Image.
  •  తెలంగాణ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గణపతి రెడ్డి 

పంజాగుట్ట, వెలుగు: కేబినేట్ సబ్ కమిటీ చర్చలకు ఆహ్వానించడం హర్షణీయమని, అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకూ ఆందోళన విరమించేది లేదని తెలంగాణ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పాడి గణపతి రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం పంజాగుట్టలోని ఓ హోటల్​లో జరిగిన రైస్ మిల్లర్స్​కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 

సీఎంఆర్ అగ్రిమెంట్ సవరించే వరకూ మిల్లర్ల ఇబ్బందులు తొలగవన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. కేబినేట్ సబ్ కమిటీ స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన ఆపుతామని, లేదంటే ఆదివారం నుంచి కలెక్టరేట్ల ఎదుట నిరవదిక రిలే దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కార్యదర్శి వీరేశం, నాయకులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.