
Jailer 2: సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ సీక్వెల్ నుంచి ప్రమోషన్స్ మొదలయ్యాయి. 2023లో వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు దానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘జైలర్ 2’కి నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, రజనీకాంత్ మరోసారి ముత్తువేల్ పాండియన్‌గా కనిపించనున్నారు. ఈ క్రమంలో మేకర్స్ ఫస్ట్ క్యారెక్టర్ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో మలయాళ నటుడు వెంజరమూడును దిలీప్ పాత్రలో పరిచయం చేశారు. ఆయన లుక్ కి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. తాజాగా విడుదలైన 35 సెకన్ల క్యారెక్టర్ ప్రోమోలో స్టైలిష్, ఇంటెన్స్ లుక్ తో సూరజ్ వెంజరమూడు పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా చూపించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ క్యారెక్టర్ ఇంట్రోకు మరింత హైప్ తీసుకొచ్చింది.
‘జైలర్ 2’లో పాత సినిమాలోని పలువురు నటీనటులు కూడా తమ పాత్రలను కొనసాగించనున్నారు. రమ్యకృష్ణన్, యోగిబాబు, మీర్నా కీలక పాత్రల్లో మరోసారి కనిపించనున్నారు. అయితే ఈసారి సినిమాకు మరింత భారీ తారాగణాన్ని జోడించారు. శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన ‘జైలర్ 2’ గ్లింప్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి సినిమాలో ముగిసిన కథకు కొనసాగింపుగా ముత్తువేల్ పాండియన్ ఈసారి మరింత పెద్ద సమస్యలో చిక్కుకోబోతున్నాడనే హింట్ ఇచ్చాయి ఈ గ్లింప్స్. కలానిధి మారన్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘జైలర్ 2’ను 2026 అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
ఇక రజనీకాంత్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే, అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ‘ధర్మన్’ అనే యాక్షన్ సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ స్టైలిష్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సిమ్రాన్, యోగిబాబు, రాశిఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే కమల్ హాసన్‌తో కలిసి KHxRK అనే టైటిల్‌తో మరో ప్రాజెక్ట్‌లోనూ రజనీకాంత్ నటించనున్నారు.